16 నుండి కరోనా వ్యాక్సినేషన్.. ఆధార్ తప్పనిసరి
కరోనా మహమ్మారిని అదుపు చేసే దిశగా కేంద్రం చర్యలు చేపడుతోంది. భారత్‌లో ఈనెల 16 నుండి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దీంతో అన్నిరాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశాలను జారీ చేసింది. కరోనా టీకా కోసం ప్రభుత్వం కోవిన్ యాప్‌ను రూపొందించింది. ఈ వేదిక ద్వారా దేశంలోని ప్రజలకు టీకాలు వేయనున్నారు.
అదేవిధంగా ఈ యాప్‌లో టీకాకు సంబంధించిన అన్ని వివరాలు పొందుపరిచారు. కరోనా టీకా తీసుకునేవారు వారి మొబైల్ నంబరుకు ఆధార్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరని ప్రభుత్వం తెలిపింది. అయితే 2018లో ప్రభుత్వ ఆదేశాలనుసారం పలువురు తమ మొబైల్ నెంబరుకు ఆధార్ నెంబర్‌ను లింక్ చేసిన సంగతి తెలిసిందే. లింక్ చేయనివారు కరోనా వ్యాక్సిన్ కోసం ఈ ప్రక్రియ అనుసరించాల్సివుంటుంది.