సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (10:26 IST)

డెల్టా వైరస్ డేంజర్ బెల్స్ : 135 దేశాలకు వ్యాప్తి

ప్రపంచంలో డెల్టా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ వైరస్ ఏకంగా 135 దేశాలకు వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకారి కావడంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పటికే 135 దేశాలకు డెల్టా వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. 
 
గత అంచనాలతో పోలిస్తే.. డెల్టా వేరియంట్‌ చాలా ప్రమాదకరంగా మారినట్టు ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా పరిశోధకులు తెలిపారు. ఈ వేరియంట్‌ను కట్టడి చేయాలంటే 80-90 శాతం మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ (సామూహికంగా రోగనిరోధక శక్తి) సాధించాల్సిన అవసరముందని చెప్పారు. 
 
కరోనా నియంత్రణకు 60-70 శాతం మంది హెర్డ్‌ ఇమ్యూనిటీ సరిపోతుందని ప్రారంభంలో అంచనా వేశామని, అయితే, తమ అంచనాలకు మించి ‘డెల్టా’ వేరియంట్‌ రెట్టింపు వేగంతో వ్యాపిస్తోందన్నారు. 80 నుంచి 90 శాతం హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధిస్తేనే ‘డెల్టా’ వేరియంట్‌ను కట్టడి చేయవచ్చన్నారు. వ్యాక్సినేషన్‌ను అన్ని దేశాలు ముమ్మరం చేయాలని సూచించారు.