శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2020 (11:01 IST)

కరోనా మూకుమ్మడి స్క్రీనింగ్ టెస్టు కోసం డ్రోన్ల పరిజ్ఞానం..

కరోనా మూకుమ్మడి స్క్రీనింగ్ టెస్టు కోసం డ్రోన్ల పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ డ్రోన్ల పరిజ్ఞానాన్ని గువహటి ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో మానవ ప్రమేయం లేకుండా ఆకాశం నుంచే ఆ ప్రాంత ప్రజల శరీర ఉష్ణోగ్రతలను ఈ పరికరం ద్వారా కొలవవచ్చు. 'ఈనెల 14వ తేదీ తర్వాత ప్రభుత్వం లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే జనం ఒకేసారి గుంపులు గుంపులుగా రోడ్ల పైకి వస్తారు.

అటువంటి సందర్భంలో భౌతిక దూరం నిబంధన అమలు కాదు. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఓ ప్రాంతంలో అనుమానిత కేసులు ఎక్కువగా ఉంటే ఈ డ్రోన్ పరికరంతో గుర్తించేందుకు సులభంగా ఉంటుందని గువహటి పరిశోధకులు చెప్పారు. ఈ డ్రోన్‌కు అమర్చిన పరారుణ కెమెరా బృందాలుగా ధర్మల్ స్క్రీనింగ్ చేస్తుంది. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్న చోట డ్రోన్లోని లౌడ్‌స్పీకర్‌ హెచ్చరికలు జారీ చేస్తుంది. అవసరమైన సూచనలు కూడా చేస్తుంది.

కరోనా విస్తరణను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 14న ముగుస్తుంది. ఈ నేపథ్యంలో 15వ తేదీ నుంచి ఇండియా పరిస్థితి ఏంటనే ఆసక్తి సర్వత్ర నెలకొంది. లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిలిచిపోయిన వ్యాపార, వాణిజ్య రంగాలను మళ్లీ పట్టాలు ఎక్కించాల్సి ఉంది. దీని కోసం ప్రభుత్వ పెద్దలు ఏం చేయబోతున్నారనే ప్రశ్న అందరిలో ఉంది. అన్ని రంగాలను అన్ లాక్ చేయడంతో పాటు... ప్రతి ఒక్కరిని 'రిటర్న్ టు వర్క్' చేయాల్సి ఉంది.