వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు.. కొత్త గైడ్ లైన్స్ జారీ
దేశవ్యాప్తంగా ప్రజలందరికి ఉచితంగా టీకా పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించడంతో న్యూ వ్యాక్సిన్ పాలసీపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాక్సిన్ పాలసీలో కేంద్రం కీలక మార్పులు చేయబోతోంది. రెండు మూడు రోజుల్లోనే కొత్త గైడ్ లైన్స్ జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ విషయంలో ఇప్పటివరకు వచ్చిన విమర్శలకు చెక్ పెడుతూ దేశవ్యాప్తంగా అందరికి వ్యాక్సిన్ అందేలా సమగ్రమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా టీకాలు సరఫరా చేయనున్నారు. అలాగే పేదలు కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో టీకా వేయించుకునేందుకు వీలుగా ప్రత్యేక ఎలక్ట్రానిక్ వోచర్స్ విడుదల చేయనుంది. ఈ వోచర్స్ తీసుకుని ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి పైసా కట్టకుండానే టీకా వేయించుకోవచ్చు. కొత్త మార్గదర్శకాలు ఈ నెల 21 నుంచి అమల్లోకి రానున్నాయి.