శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (15:20 IST)

కొవాగ్జిన్‌ టీకా ధరలను ప్రకటించిన భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: కొవాగ్జిన్‌ టీకా ధరలను భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు సరఫరా చేసే టీకా ధర డోసుకు ₹600, ప్రైవేటు ఆసుపత్రులకు సరఫరా చేసే ధర డోసుకు ₹1200గా ఉంటుందని ఆ సంస్థ ఛైర్మన్‌ కృష్ణా ఎల్లా వెల్లడించారు.

విదేశాలకు విక్రయించే టీకా మాత్రం డోసుకు 15 నుంచి 20 డాలర్లుగా ఉంటుందని తెలిపారు. ‘‘ఈ టీకా తేలికపాటి, మధ్యస్థాయి, తీవ్రమైన కొవిడ్‌-19 వ్యాధిపై 78 శాతం ప్రభావశీలత (ఎఫికసీ) కనబరచింది. దీన్ని తీసుకుంటే.. ‘తీవ్రమైన కరోనా’ వ్యాధితో ఆస్పత్రి పాలయ్యే అవకాశాలు నూరు శాతం లేవు. ప్రాణాంతకంగా పరిణమించకుండా వ్యాక్సిన్‌ అడ్డుకోగలిగింది’’ అని సంస్థ పేర్కొంది.