ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 ఏప్రియల్ 2023 (11:51 IST)

దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. 24 గంటల్లో 4వేల కేసులు

corona
దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో ఏకంగా నాలుగు వేలకు పైగా కొత్త కేసులు నమోదైనాయి. 163 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 
 
మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 1,31,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,435 కొత్త కేసులు బయటపడ్డాయి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కొత్త కేసుల్లో 46 శాతం మేర పెరుగుదల కనిపించింది.  ప్రస్తుతం 23,091 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
గత 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి కేరళ, మహారాష్ట్రలో నలుగురు చొప్పున, ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, కర్ణాటక, పుదుచ్ఛేరి, రాజస్థాన్‌లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 15 మంది మృతి చెందారు.