శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 9 జూన్ 2021 (10:13 IST)

జూన్ 9న కరోనా బులిటెన్ : స్వల్పంగా పెరిగిన కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరోమారు స్వల్పంగా పెరిగాయి. అలాగే, వరుసగా రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,596 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా...2,219 మంది మృతి చెందారు. మంగళవారం ఒక్కరోజే 1,62,664 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. 
 
దేశంలో వ్యాప్తంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,90,89,069కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 12,31,415 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటివరకు 2,75,04,126 మంది బాధితులు కోలుకున్నారు. 
 
కొవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 3,53,528 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.55 శాతం కాగా, మరణాల రేటు 1.22శాతంగా ఉంది. ఇప్పటివరకు 23,90,58,360 మందికి కరోనా టీకాలు వేయించుకున్నారు. 
 
కాగా, దేశంలో మంగళవారం వరకు మొత్తం 37,01,93,563 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 19,85,967 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.