సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 జూన్ 2021 (17:30 IST)

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులెన్ని!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. ఈ ప్రకటన మేరకు... ఏపీలో గడచిన 24 గంటల్లో 85,311 కరోనా పరీక్షలు నిర్వహించగా 10,413 మందికి కరోనా పాజిటివ్ కేసులు సోకినట్టు తేలింది. 
 
ఇందులో అత్యధికంగా తూర్పు గోదావరి (2,075), చిత్తూరు (1,574) జిల్లాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని జిల్లాల్లో వెయ్యికి లోపే కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 293 కేసులు గుర్తించారు.
 
మరోవైపు, 15,469 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 83 మంది మరణించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 14 మంది మరణించగా, పశ్చిమ గోదావరి జిల్లాలో 11 మంది కన్నుమూశారు. ఈ క్రమంలో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 11,296కి చేరింది. 
 
మరోవైపు, దేశంలో గడిచిన 24 గంటల్లో 1,32,364 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. ఆ ప్రకారంగా 2,07,071 మంది కోలుకున్నారు. 
 
దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మరో 2,713  మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,40,702కు పెరిగింది.
 
ఇక దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,65,97,655 మంది కోలుకున్నారు. 16,35,993 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశ వ్యాప్తంగా 22,41,09,448 మందికి వ్యాక్సిన్లు వేశారు.