శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 జనవరి 2021 (12:35 IST)

దేశంలో పదివేల దిగువకు పడిపోయిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గతంలో 70 నుంచి 80 వేల వరకు నమోదయ్యే కేసులు ఇప్పుడు 10 వేల దిగువకు పడిపోయాయి. కేసుల సంఖ్య భారీగా తగ్గడం ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి.

ఇక గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 9,102 కరోనా కేసులు నమోదుకాగా 15,901 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,06,76,838 కి చేరింది. 
 
ఇందులో 1,03,45,985 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,77,266 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బులెటిన్ ప్రకారం ఇండియాలో తాజాగా కరోనాతో 117 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,53,587 కి చేరింది. కాగా.. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20,23,809 మంది టీకా తీసుకున్నారు.