ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By వి
Last Modified: మంగళవారం, 18 ఆగస్టు 2020 (13:31 IST)

భారత్‌లో కరోనా ఉగ్రరూపం... కొత్తగా 55,079 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరుగుతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు ఉద్భవిస్తున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 27 లక్షల దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 55,079 కేసులు నమోదయ్యాయి. కాగా 876 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 57,937 మంది చికిత్స నిమిత్తం కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 27,02,742 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,73,166 ఉండగా 19,77,779 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 51,797మంది కరోనా వ్యాధితో మరరణించారు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 73.18 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదైన కేసులో 1.92 శాతానికి తగ్గిన మరణాల రేటు. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల శాతం 24.91 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 8,99,864 టెస్టులు జరిగాయి. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 3,09,41,264కి చేరింది.