శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (15:31 IST)

ఏప్రిల్‌లోనే బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్‌కు కోవిడ్.. కొన ఊపిరితో..?

Prince William
బ్రిటన్ రాకుమారుడు విలియమ్స్‌కు .. ఏప్రిల్ నెలలోనే కోవిడ్‌19 సంక్రమించింది. ప్రిన్స్ విలియమ్స్ తండ్రి ప్రిన్స్ చార్లెస్‌కు వైరస్ సోకిన సమయంలోనే ఆయనకు వచ్చినట్లు తాజా మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. విలియమ్స్ పరీక్ష నివేదికలను రహస్యంగా ఉంచినట్లు ఓ కథనం ద్వారా వెల్లడైంది. మార్చి చివర్లోనే ప్రిన్స్ చార్లెస్‌కు వైరస్ సంక్రమించింది. ఆ సమయంలోనే 38 ఏళ్ల విలియమ్స్ కూడా వైరస్ బారినపడ్డారు. 
 
కానీ పాజిటివ్ రిపోర్ట్‌ను విలియమ్స్ బయటపెట్టలేదు. దేశ ప్రజలను భయాందోళనలకు గురి చేయవద్దు అన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్పలేదని రాచవర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే కెన్‌సింగ్టన్ ప్యాలెస్ ఆఫీసు అధికారులు ఈ అంశాన్ని ఇంకా ద్రువీకరించలేదు. 
 
ఈస్ట్రన్ ఇంగ్లండ్‌లో ఉన్న నార్‌ఫ్లోక్‌లో కుటుంబ వైద్యులు ప్రిన్స్‌కు చికిత్స అందించారు. వైరస్ వల్ల విలియమ్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారని, దాదాపు కొన ఊపిరితో పోరాడినట్లు తెలుస్తోందని సమాచారం. ఓ దశలో విలియమ్స్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడ్డారని, ఆ సమయంలో అందరూ ఆందోళన చెందినట్లు తెలిసింది.