సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 జులై 2020 (10:43 IST)

తెలంగాణలో కరోనా.. గ్రేటర్ హైదరాబాదులోనే 703 కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణలో 1,430 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 47,705కు చేరకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 429గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 10,891 ఉన్నాయి. 
 
ఇప్పటి వరకూ కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 36,385గా ఉంది. కొత్తగా నమోదయిన 1430 కేసుల్లో 703 కేసులు హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అయితే కరోనా వైరస్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికి విస్తరిస్తుండటం ఆందోళన కల్గిస్తుంది.
 
మంగళవారం గ్రేటర్‌ హైదరాబాద్‌ కంటే జిల్లాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా 1430 కేసులు రాగా, ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 703, జిల్లాల్లో 727 నమోదయ్యాయి. ఇక ఆది, సోమవారాల్లో మొత్తం కేసుల్లో జిల్లాల్లో 57శాతం ఉండగా, మంగళవారం 51శాతానికి తగ్గింది.
 
మంగళవారం నాటి కేసులను చూస్తే.. రంగారెడ్డి జిల్లావి 117,మేడ్చల్‌ 105, సంగారెడ్డి 50, నల్గొండ 45, కామారెడ్డి 43, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 34 కేసులు నమోదయ్యాయి. మొత్తం 16,855 మందికి కరోనా పరీక్షలు చేయగా, అందులో 8.5శాతం మందికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.