గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 మే 2021 (10:20 IST)

తెలంగాణలో కరోనా కేసులు.. 29 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి, గడిచిన 24 గంటల్లో 57,416 టెస్టులు చేయగా.. 4,305 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర వైద్యారోగ్యశాఖ. ఇందులో 607 కేసులు గ్రేటర్ పరిధిలో నమోదుకాగా..మొత్తం కేసుల సంఖ్య 5,20,709కి చేరిందని చెప్పింది.
 
గడిచిన 24 గంటల్లో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2,896కి పెరిగినట్లు తెలిపింది. శుక్రవారం 6,361 మంది వైరస్ నుంచి కోలుకుంటున్నట్లు చెప్పిన ఆరోగ్యశాఖ..రాష్ట్రంలో ప్రస్తుతం 54,832 యాక్టీవ్ కేసులు ఉన్నాయని తెలిపింది.