సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2020 (09:49 IST)

కరోనా విజృంభణ.. డిసెంబరు 1 నుంచే సెకండ్ వేవ్ మార్గదర్శకాలు

కరోనా వైరస్ విజృంభిస్తోంది. వరుసగా 40వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 44,489 కొత్త కరోనా కేసులు వెలుగుచూశాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 93 లక్షలకు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం 5,246 కొత్త కేసులు నమోదయ్యాయి. 99మంది చనిపోయారు. అయితే, దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో... కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
 
కరోనా నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్ని నియంత్రించాలని, కాంటాక్ట్ ట్రేసింగ్ను పెంచాలని కోరుతూ... హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 1 నుంచే కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయని హోంశాఖ తెలిపింది హోంశాఖ.
 
అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం... కేంద్రం అనుమతిలేకుండా రాష్ట్రాలు స్థానికంగా లాక్డౌన్ను విధించలేవు. కంటైన్మెంట్ జోన్లలో అత్యవసర సేవలకు మాత్రమే అనుమతినిస్తారు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల నిబంధనలకు లోబడి అన్ని కార్యకలాపాలకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నిబంధనలు డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటాయని భావిస్తున్నారు.