గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 17 అక్టోబరు 2022 (11:39 IST)

దేశంలో కరోనా వ్యాప్తి : 2 వేలకు దిగువున కొత్త కేసులు

pneumonia after corona
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గిపోయింది. రోజువారీగా ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఒక్క కేరళ రాష్ట్రంలో మినహా ఇతర రాష్ట్రాల్లో కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య రెండు వేల సమీపానికి చేరుకుంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2060 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
మొత్తం 110863 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇందులో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య 2060గా ఉంది. ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు మొత్తం చనిపోయిన వారిసంఖ్య మాత్రం 528905గా ఉంది. మొత్తం రికవరీలు 4.40 కోట్లుగా ఉంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న పాజిటివ్ కేసుల సంఖ్య 26,8354గా ఉంది.