ఆంధ్రప్రదేశ్ అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్ ఇవే...
అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ను ఆంధ్రప్రదేశ్ సర్కారు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, విద్యాసంస్థలు బంద్ కానున్నాయి. అటు కంటైన్మెంట్ జోన్లలో కూడా ఈ నెల 30 వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది.
అటు సెప్టెంబర్ 21 నుంచి 9-12 తరగతుల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా.. ఇందుకు తల్లిదండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ జారీ చేసిన మరికొన్ని మార్గదర్శకాల సంగతికి వస్తే...
* ప్రాజెక్టులు, పరిశోధనల కోసం పీహెచ్‌డీ, పీజీ విద్యార్థులకు అనుమతి
* సెప్టెంబర్ 21 నుండి 100 మందికి మించకుండా సామాజిక, విద్య, స్పోర్ట్స్, మతపరమైన, పొలిటికల్ సమావేశాలకు అనుమతి
* సెప్టెంబర్ 20 నుంచి పెళ్లిళ్లకు 50 మంది అతిథులతో అనుమతి, అంతక్రియలకు 20 మందికి అనుమతి
* సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరణ
* ఈ నెల 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరుచుకోవచ్చు.
* సెప్టెంబర్ 21 నుంచి స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లకు అనుమతి ఇస్తున్నట్లు ఏపీ సర్కారు తెలిపింది.