శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : బుధవారం, 4 జనవరి 2023 (23:06 IST)

భారత్‌లో మళ్లీ కరోనా ఎంట్రీ.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఖాయమా?

Work From Home
భారత్‌లో రోజురోజుకు కరోనా వైరస్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే నలభై రోజులు కఠినంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీని తర్వాత మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేసేందుకు పలు ఐటీ కంపెనీలు యోచిస్తున్నట్లు సమాచారం.
 
కొన్ని కంపెనీలు మూడు రోజుల ఆఫీస్ వర్క్, రెండు వర్క్ ఫ్రమ్ హోమ్ డేస్ ప్రకటించగా, ఇతర కంపెనీలు కూడా అదే విధానాన్ని అనుసరించవచ్చునని టాక్. 
 
కరోనా వైరస్ వ్యాప్తి పెరగడం ప్రారంభిస్తే టీసీఎస్‌తో సహా పలు ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ అమలు చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే టెక్ మహీంద్రా, విప్రో ఇన్ఫోసిస్ ఉద్యోగులు ఎక్కడి నుండైనా పని చేసే సౌలభ్యాన్ని కొనసాగిస్తున్నారు.