1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (14:54 IST)

రెండో సెమీ ఫైనల్ : సౌతాఫ్రికా బ్యాటింగ్.. 2 వికెట్లు డౌన్

icc world cup
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురువారం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన సౌత్రాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా జట్టు రెండు మార్పులు చేసింది. ఆల్‌రౌండ్ర మార్కస్ స్టోయినిస్, పేసర్ అబ్బాట్ స్థానంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్‌ను జట్టులోకి తీసుకున్నారు. 
 
అలాగే, సౌతాఫ్రికా జట్టులోనూ రెండు మార్పులు చేశారు. పేసర్ లుంగీ ఎంగిడీ స్థానంలో స్పిన్నర్ తబ్రైజ్ షంసీ, ఆల్‌రౌండర్ ఫెహ్లుక్వాయో స్థానంలో మార్కో యన్సెన్ జట్టులోకి వచ్చారు. కాగా, ఈ రెండో సెమీస్‌లో గెలిచిన జట్టు ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లో భారత్‌తో తలపడుతుంది. ఇందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే, రెండో సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన సౌతాఫ్రికా జట్టు ఆదిలోనే రెండు వికెట్లను కోల్పోయింది. జట్టు ఓపెనర్లు డీ కాక్ (3), బవుమా (0)లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. దీంతో సఫారీలు కేవలం 8 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లను స్టార్క్, హాజల్‌వుడ్‌లు పడగొట్టారు. ప్రస్తుతం క్రీజ్‌లో దుస్సెన్, మాక్రమ్‌లు ఉన్నారు. 10.4 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది. అయితే, మాక్రమ్‌ కూడా వ్యక్తిగతంగా పది పరుగులు చేసి స్టార్క్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. అప్పటిక జట్టు స్కోరు 10.5 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 22 పరుగులు చేసింది.