సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 నవంబరు 2023 (11:40 IST)

ఈడెన్ గార్డెన్‌లో కోహ్లీ పుట్టిన రోజు వేడుకలు రద్దు

ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ సందర్భంగా భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పుట్టిన రోజు వేడుకలకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) భారీ ఏర్పాట్లుచేసింది. కానీ, ఆకస్మికంగా ఈ బర్త్ డే వేడుకలు రద్దు చేసారు. కోహ్లీ బర్త్ డే వేడుకలను పురస్కరించుకుని మ్యాచ్ చూసేందుకు వచ్చే 70 వేల మంది అభిమానులకు కోహ్లీ ఫోటోతో ముద్రించిన మాస్క్లు ఇచ్చేందుకు ప్లాన్ చేశారు. అలాగే, భారీ ఎత్తు బాణాసంచా కాల్చేందుకు ఏర్పాటు చేశారు. భారీ కేక్ కట్టింగ్ సెలెబ్రేషన్స్‌కు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఇపుడు ఇవన్నీ రద్దు చేశారు. 
 
ఇలాంటి వేడుకలను నిర్వహించడం ఐసీసీ నిబంధనలకు విరుద్ధం. దీంతో బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తీవ్ర నిరుత్సాహం చెంది అన్ని ఏర్పాట్లను రద్దు చేసింది. బర్త్ డే కేక్ కట్టింగ్ వేడుకలను కేవలం డ్రెస్సింగ్ రూమ్‌లోనే చేయాలని నిర్ణయించింది. కాగా, ప్రస్తుత వరల్డ్ కప్‌లో మంచి ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడి 442 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. మొదటి స్థానంలో క్వింటన్ డికాక్ ఉన్నాడు.