శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (15:28 IST)

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సౌతాఫ్రికా క్రికెటర్

సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు చెందిన ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అన్ని ఫార్మెట్ల నుంచి వైదొలుగుతున్నట్టు శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
37 యేళ్ల డివిలియర్స్... 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టారు. మొత్తం 114 టెస్టులు 228, 78 ట్వంటీ20 మ్యాచ్‌లను ఆడాడు. అన్ని ఫార్మెట్లలో కలుపుకుని ఏకంగా 20,014 పరుగులు చేశాడు. 
 
టెస్టుల్లో, వన్డేలో డివిలియర్స్ సగటు 50 కంటే ఎక్కువగా ఉంది. నిజానికి ఈయన అంతర్జాతీయ క్రికెట్ నుంచి గత 2018లోనే తప్పుకున్నాడు. ఇపుడు అధికారికంగా ప్రకటించారు. ఇదిలావుంటే, డివిలియర్స్ ఆర్బీసీ జట్టుకు కూడా దూరంకానున్నాడు.