అనుష్కతో ఎంగేజ్‌మెంట్ లేదు... అంతా బుస్సే :-)), విరాట్ కోహ్లి

ఉత్తరాఖండ్ నరేంద్ర నగర్ లోని ఫార్మ్ హౌసులో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ కోహ్లి నిశ్చితార్థం జరుగబోతోందని పలు ఛానళ్ళు, ఇతర మీడియాలో వచ్చిన వార్తలను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించారు. ట్విట్టర్లో రాస్తూ... మా ఇద్దరి నిశ్చితార్థం జరుగడంలేదు. ఒకవేళ

kohli-anushka
ivr| Last Modified శుక్రవారం, 30 డిశెంబరు 2016 (14:10 IST)
ఉత్తరాఖండ్ నరేంద్ర నగర్ లోని ఫార్మ్ హౌసులో బాలీవుడ్ నటి అనుష్క శర్మతో విరాట్ కోహ్లి నిశ్చితార్థం జరుగబోతోందని పలు ఛానళ్ళు,  ఇతర మీడియాలో వచ్చిన వార్తలను క్రికెటర్ విరాట్ కోహ్లి ఖండించారు. ట్విట్టర్లో రాస్తూ... మా ఇద్దరి నిశ్చితార్థం జరుగడంలేదు. ఒకవేళ మేము నిశ్చితార్థం చేసుకుంటే దాచిపెట్టాల్సిన అవసరం అంతకంటే లేదు. తప్పుడు వార్తలను పలు న్యూస్ ఛానళ్లు అమ్ముకుంటూ తమ రేటింగులు పెంచుకునేందుకు తాపత్రయ పడతాయి. 
 
ఐతే ఆ వార్తల వల్ల కన్ఫ్యూజన్ తలెత్తుతుంది. ఆ కన్ఫ్యూజన్ లేకుండా చేసేందుకు నేను ఇలా ట్విట్టర్లో కామెంట్ పోస్ట్ చేశానంటూ కోహ్లి పేర్కొన్నాడు. మరోవైపు అనుష్క శర్మ కూడా కోహ్లి ట్వీట్ ను రీ-ట్వీట్ చేసింది. దీనితో వారి నిశ్చితార్థం జనవరి 1న జరుగుతుందన్న ప్రచారం అంతా బూటకమేనని తేలింది.దీనిపై మరింత చదవండి :