శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (09:55 IST)

శ్రీదేవి భర్తను పరామర్శించిన అనుష్క శర్మ..

దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలి

దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న అనుష్క శర్మ శ్రీదేవి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయింది. ఫిబ్రవరి 24న దుబాయ్‌ హోటల్‌లో శ్రీదేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సినీ నటి అనుష్క శర్మ బోనీ కపూర్ నివాసానికి వెళ్లి.. వారిని పరామర్శించారు. 
 
మరోవైపు శ్రీదేవి మృతిలో అనుమానాలున్నాయంటూ వస్తున్న కథనాలపై శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి.. స్పందించింది. తన తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీ కపూర్ అన్యోన్య దంపతులని చెప్పింది. వారి బంధాన్ని అపహాస్యం చేయవద్దని జాన్వీ వేడుకుంది. 
 
తల్లిదండ్రులు ప్రేమను కించపరచవద్దని వేడుకుంది. వారి బంధాన్ని గౌరవించాలని కోరింది. తాను, ఖుషీ తల్లిని కోల్పోతే, తమ తండ్రి సర్వస్వాన్నే పోగొట్టుకున్నారని వాపోయింది. తామిద్దరికీ తల్లిగా, తండ్రికి సహచరిగా ఆమె తన పాత్రను సమర్థవంతంగా పోషించిందని తెలిపింది.