గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 నవంబరు 2017 (09:41 IST)

బీసీసీఐకి రూ.52కోట్ల భారీ జరిమానా.. సచిన్ జెర్సీ 10కు వీడ్కోలు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికట్ ప్రసార హక్కుల కేటాయింపుల విషయంలో బీసీసీఐకి భారీ జరిమానా విధించడం జరిగింది. ఈ క్రమంలో కాంపిటషన్ వాచ్ డాగ్ సీసీఐ రూ.52కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కూడా కేవల

ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికట్ ప్రసార హక్కుల కేటాయింపుల విషయంలో బీసీసీఐకి భారీ జరిమానా విధించడం జరిగింది. ఈ క్రమంలో కాంపిటషన్ వాచ్ డాగ్ సీసీఐ రూ.52కోట్ల భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని కూడా కేవలం 60 రోజుల్లో చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 
 
2008 నుంచి ఐపీఎల్ ప్రసార హక్కులను సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కలిగివుంది. కానీ 2018-22కి గాను స్టార్ ఇండియా 2.25 బిలియన్ డాలర్లకు కైవసం చేసుకుంది. ఈ డీల్ అక్రమమని.. ఇది గత డీల్ కంటే 150 రెట్లు అధికమని తేలింది. పోటీ మార్కెట్ విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో సీసీఐ బీసీసీఐకి షాక్ ఇచ్చింది. ఈ  క్రమంలో రూ.52 కోట్లను జరిమానాగా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
 
మరోవైపు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ జెర్సీ నంబర్‌ పదిపై నెలకొన్న వివాదంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. అనధికారికంగా ఈ జెర్సీ నంబర్‌ను రిటైర్మెంట్‌  ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. అంతేగాకుండా అంతర్జాతీయ మ్యాచుల్లో ఏ క్రికెటరూ.. పదో నెంబర్ జెర్సీని ధరించవద్దని బీసీసీఐ నిర్ణయించింది. 
 
2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు సచిన్‌ రిటైర్మెంట్‌ సందర్భంగా క్రికెట్ దేవుడి సేవలకు గౌరవపూర్వకంగా జెర్సీ నెం.10కు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నామని బీసీసీఐ స్పష్టం చేసింది. 
 
అయితే గత ఆగస్టులో శ్రీలంక పర్యటనలో అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన యువ క్రికెటర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ 10వ నంబర్‌ జెర్సీ ధరించడం సచిన్‌ అభిమానులకు కోపం తెప్పించింది. దీంతో బీసీసీఐ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ నెం.10జెర్సీకి వీడ్కోలు పలికింది.