శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (17:10 IST)

ఐసీసీ వన్డే ప్రపంచ కప్: వాటర్ బాటిల్ ఫ్రీ.. ఇంగ్లండ్-కివీస్ పోరు ప్రారంభం

World cup
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్‌లను వీక్షించేందుకు మైదానానికి వచ్చే అభిమానులకు ఉచితంగా వాటర్ బాటిల్ ఇవ్వబడుతుంది అని ప్రకటించారు జైషా. ఐసిసి వన్డే ప్రపంచకప్‌ తొలి మ్యాచ్ అక్టోబర్ 5వ తేదీ మొదటి తేదీన జరగనుంది.
 
అలాగే ప్రపంచ కప్‌లో పాల్గొనే అన్నీ జట్లతో కూడిన ఫోటోలను ఐసీసీ ఇప్పటికే షేర్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ పోటీలను వీక్షించేందుకు వచ్చే క్రికెట్ అభిమానులను ఉచితంగా నీటి బాటిళ్లను అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.
 
మరోవైపు వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్- న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న తొలి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ బ్యాటింగ్‌తో దూకుడుగా ఆడుతోంది. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో... సిక్సర్‌తో మెగాటోర్నీని ప్రారంభించగా.. జోరూట్ రివర్స్ స్కూప్ సిక్సర్‌తో అభిమానులను అలరించాడు. 
 
అది కూడా న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్డ్ బౌలింగ్‌లో రిస్క్ చేస్తూ రివర్స్ స్కూప్ ఆడటం అందర్నీ ఆకట్టుకుంది. ట్రెంట్ బౌల్డ్ వేసిన 12వ ఓవర్‌లో ఇది జరిగింది.