భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు మంత్రిపదవి
భారత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రి పదవి దక్కింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గాన్ని ఈ నెల 31వ తేదీన విస్తరించనున్నారు. ఇందులో అజారుద్దీన్‌కు మంత్రి పదవిని కేటాయించారు. దీంతో అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు సమాచారం. రాష్ట్రమంత్రి వర్గ విస్తరణకు పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
అయితే, ఈ మంత్రివర్గం విస్తరణ తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేతల్లో ఎలాంటి చిచ్చు రేపుతుందో వేచి చూడాల్సివుంది. మంత్రి పదవి కోసం ఇప్పటికే సీనియర్ నేత, మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టిగా పట్టుబట్టారు. పైగా, తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇచ్చిన మంత్రిపదవితో తనకు సంబంధం లేదని తనకు మంత్రిపదవి ఇవ్వాల్సిందేనంటూ ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్న విషయం తెల్సిందే.