మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జనవరి 2024 (14:30 IST)

పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఇంగ్లండ్‌కు మకాం మార్చాడా?

sarfaraj ahmed
పాకిస్థాన్ టెస్ట్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తన భార్యాపిల్లలతో కలిసి ఇంగ్లండ్‌కు వెళ్లిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై సర్ఫరాచ్ అహ్మద్ స్పందించాడు. తనకు పాకిస్థాని విడిచి వెళ్లాలన్న ఆలోచన లేశమాత్రం కూడా రాదన్నారు. ఆ వార్తలు శుద్ధ అబద్ధమన్నారు. ఇలాంటి పుకార్లను ప్రచారం చేసే ముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని ఆయన హితవు పలికారు. ఇలాంటి వార్తలు వినాల్సి రావడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశాడు. 
 
కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 36 యేళ్ల సర్ఫరాజ్ తీవ్రంగా నిరాశపరిచాడు. టెస్టు జట్టు ఆశ్చర్యకరంగా చోటు దక్కించుకున్న సర్ఫరాచ్.. రెండు ఇన్నింగ్స్‌లలో కలిసి సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఆయన దేశాన్ని వీడి ఇంగ్లండ్‌కు మకాం మార్చినట్టు వార్తలు రావడంతో సర్ఫరాజ్ క్లారిటీ ఇచ్చాడు.