1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (16:42 IST)

చిరుతపులి దాడి.. కాపాడిన పెంపుడు శునకం.. ఆస్పత్రిలో క్రికెటర్

Zimbabwe cricketer Guy Whittall
Zimbabwe cricketer Guy Whittall
జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టాల్, చిరుతపులి దాడితో ఆసుపత్రి పాలయ్యాడు. త‌న య‌జ‌మానిపై చిరుత దాడి చేయ‌గా త‌న ప్రాణాల‌కు తెగించి కుక్క అత‌డి ప్రాణాల‌ను కాపాడింది. 51 ఏళ్ల మాజీ ఆల్‌ రౌండర్ అయిన గై విట్టాల్ జింబాబ్వేలో స‌ఫారీ నిర్వ‌హిస్తున్నాడు. ఇటీవ‌ల అత‌డు హ్యూమ‌ని ప్రాంతంలో త‌న పెంపుడు కుక్క చికారాను తీసుకుని ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. ఆ స‌మ‌యంలో హ‌ఠాత్తుగా అత‌డిపై చిరుత దాడి చేసింది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన చికారా త‌న య‌జ‌మానిని ర‌క్షించేందుకు చాలా తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో చికారా కూడా తీవ్రంగా గాయ‌ప‌డింది. అయిన‌ప్ప‌టికీ త‌న పోరాటం ఆప‌లేదు. చివ‌ర‌కు చిరుత వెళ్లిపోయింది. 
 
అతని భార్య, హన్నా విట్టల్, సోషల్ మీడియాలో (ఫేస్‌బుక్) చేసిన పోస్ట్ ప్రకారం, దాడి మంగళవారం జరిగింది. దీని తరువాత అతను చికిత్స కోసం హరారేకి విమానంలో తరలించబడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా వుందని చెప్పారు. 
 
విట్టల్ 1993, 2003 మధ్య జింబాబ్వే తరపున 46 టెస్టులు, 147 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో 4912 పరుగులు సంపాదించాడు. టెస్టులో 51 వికెట్లు, వన్డేల్లో 88 వికెట్లు పడగొట్టాడు.