సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (10:24 IST)

మైనింగ్ వ్యాపారవేత్త రాంధావా కుమారుడు మృతి

plane
భారతీయ బిలియనీర్, మైనింగ్ వ్యాపారవేత్త హర్పాల్ రాంధావా కుమారుడు సెప్టెంబర్ 29న జింబాబ్వేలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. 
 
రంధావా 22 ఏళ్ల కుమారుడు అమెర్.. సొంత ప్రైవేట్ విమానం సాంకేతిక లోపంతో నైరుతి జింబాబ్వేలోని వజ్రాల గని సమీపంలో కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోయారు. 
 
ముఖ్యంగా, హర్పాల్ రాంధావా రియోజిమ్ యజమాని. మైనింగ్ వ్యాపారంలో రాణిస్తున్న రాంధావా 4-బిలియన్ల ప్రైవేట్ ఈక్విటీ వ్యాపార GEM హోల్డింగ్స్‌ను కూడా స్థాపించారు.
 
 ఇక రాంధావా కుమారుడు ప్రయాణించిన విమానంలో 206మంది ప్రయాణీకులు వున్నారు.  
 
ఈ విమానం హరారే నుంచి మురోవా వజ్రాల గనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రియోజిమ్‌కు చెందిన మురోవా డైమండ్స్ గని సమీపంలో సింగిల్-ఇంజిన్ విమానం కూలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ చనిపోయారు. 
 
రాంధావా కుమారుడి మరణం పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.