మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 1 జులై 2019 (15:18 IST)

కాఫీ విత్ కరణ్ ఎఫెక్టా? హార్దిక్ పాండ్యా అలా చేతుల్ని నలుపుతూ?

కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న టీమిండియా క్రికెట‌ర్లు హార్దిక్ పాండ్యా, క‌న్న‌డిగుడు కేఎల్ రాహుల్‌‌లు ప్రస్తుతం మళ్లీ వార్తల్లో నిలిచారు. ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో భాగంగా బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్ వివాదాస్పదంగా ప్రవర్తించారు.
 
ఒక‌రి చేతుల‌ను ఒక‌రు న‌లుపుకొంటూ క‌నిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వారి ప్ర‌వ‌ర్త‌న‌పై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. సెటైర్ల మీద సెటైర్లు విసురుతున్నారు. బ‌హిరంగంగా, కెమెరాలు ఉన్నాయ‌నే భ‌యం కూడా లేకుండా చేతులు తడుముకుంటూ ప్రవర్తించడంపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. 
 
అస‌లే ప్ర‌పంచ‌క‌ప్‌. పైగా టీమిండియా మంచి దూకుడు మీద ఉంది. ఇంగ్లండ్‌కు చావో, రేవో తేలాల్సిన మ్యాచ్ అది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే సెమీఫైన‌ల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవ‌డానికి ఇంగ్లండ్‌కు గ‌ల అవ‌కాశాలు చాలావ‌ర‌కు మెరుగుప‌డ‌తాయి. 
 
అలాంటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఎలా ఎదుర్కోవాల‌నే అంశంపై టీమిండియా కేప్టెన్ విరాట్ కోహ్లీ త‌న స‌హ‌చ‌ర జ‌ట్టు స‌భ్యుల‌కు సూచ‌న‌లు చేస్తున్న స‌మ‌యంలో చేతులు తడుముకుంటూ హార్దిక్ కనిపించడం ప్రస్తుతం వివాదాస్పదమైంది. కెప్టెన్ కోహ్లీ ఇస్తున్న సూచన‌లు, స‌ల‌హాల‌ను ప‌ట్టించుకోకుండా త‌మ లోకంలో తాము మునిగిపోయి, చేతులు న‌లుపుకోవ‌డంపై పెట్టారని నెటిజన్లు ఆరోపణలు చేస్తున్నారు.