సోమవారం, 6 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2017 (16:07 IST)

ధోనీ స్టంపింగ్ కంటే వేగంగా మాల్యాకు బెయిల్ వచ్చింది.. రైతులనైతే అరెస్ట్ చేస్తారు..

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో జనాన్ని అలరించిన సెహ్వాగ్.. సరికొత్త

ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా వుంటూ.. చమత్కారాలు పోస్ట్ చేసే.. భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో మరోసారి ట్వీట్ చేశారు. మైదానంలో తన బ్యాటింగ్‌తో జనాన్ని అలరించిన సెహ్వాగ్.. సరికొత్త ట్వీట్లతో ప్రజల మనస్సును దోచుకుంటున్నాడు. తాజాగా లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి సెహ్వాగ్ ట్వీట్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 
 
బ్యాంకు రుణాలను ఎగవేతకు పాల్పడిన లిక్కర్ బారొన్, బిజినెస్ టైకూన్ విజయ్ మాల్యాను ఉద్దేశించి సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. విజయ్ మాల్యాకు ‘ ధోని స్టంపింగ్ కంటే వేగంగా విజయ్ మాల్యాకు బెయిల్ లభించింది’ అంటూ ట్వీట్ చేశారు. రైతులు తీసుకున్న రుణాలు చెల్లించకపోతే వారిని అరెస్టు చేస్తారని, అదే విజయ్ మాల్యాను ఏడాది తర్వాత అరెస్టు చేసి వెంటనే బెయిల్ మంజూరు చేశారని ఎద్దేవా చేశారు.