శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (15:01 IST)

ఆసీస్ ఆటగాళ్ల బస్సుపై దాడి.. ''సారీ ఆస్ట్రేలియా'' క్షమాపణలు కోరిన గౌహతి యువత

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియ

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. ఆస్ట్రేలియా గెలిచింది. సొంత గడ్డపై భారత్ ఓడిపోయిందన్న కోపంతో గౌహతి క్రికెట్ ఫ్యాన్స్ మ్యాచ్ ముగిశాక కోపంతో ఉన్న ఫ్యాన్స్ ఆస్ట్రేలియా జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు రివ్వారు. ఇలా ఆతిథ్య జట్టు క్రికెటర్లు ప్రయాణించే బస్సుపై దాడికి పాల్పడటంపై అంతర్జాతీయ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన యువత మనసు మార్చుకుంది. 
 
ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ వైఖరిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాము చేసిన పనికి వస్తున్న విమర్శలతో గౌహతి యువత మనసు మార్చుకుని.. ఆసీస్ క్రికెటర్లు బసచేసిన రాడిసన్ బ్లూ హోటల్ ముందు క్షమాపణలు కోరుతూ ప్లకార్డులను ప్రదర్శించారు. వందలాది మంది హోటల్ ముందు.. తాము చేసిన పనికి సిగ్గుపడుతున్నామని సారీ ఆస్ట్రేలియా అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు.