సోమవారం, 2 అక్టోబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 8 డిశెంబరు 2022 (17:24 IST)

భారత్-ఆస్ట్రేలియా-శ్రీలంక సిరీస్.. షెడ్యూల్ ప్రకటన

cricket stadium
చెన్నైలోని చేపాక్కం స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే మ్యాచ్ తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది భారత జట్టు శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో ఆడనుంది. జనవరి 3న శ్రీలంకతో సిరీస్ ప్రారంభమై జనవరి 15వరకు కొనసాగుతుందని ప్రకటించారు.
 
అలాగే జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1 వరకు న్యూజిలాండ్‌తో సిరీస్‌ జరగనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 9న ఆస్ట్రేలియాతో భారత జట్టు సిరీస్ ప్రారంభం కానుందని ప్రకటించారు. 
 
భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే మార్చి 22న చెన్నైలోని చెపాక్కం స్టేడియంలో జరుగుతుందని ప్రకటించారు. చాలా గ్యాప్ తర్వాత చెన్నైలో మ్యాచ్ జరగనుండడంతో క్రికెట్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.