సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 11 అక్టోబరు 2023 (18:41 IST)

ఆప్ఘనిస్థాన్‌తో భారత్ మ్యాచ్ : టార్గెట్ 273 రన్స్

india vs afghanistan
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బుధవారం క్రికెట్ పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుతో భారత్ తలపడింది. ఢిల్లీ వేదికగా జరిగిన జరుగుతున్న మ్యాచ్‌లో ఆప్ఘనిస్థాన్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి 272 పరుగులు చేసింది. ఆ తర్వాత 273 పరుగుల విజయలక్ష్యంతో భారత్ బరిలోకి దిగింది. టాస్ నెగ్గిన ఆప్ఘన్ కెప్టెన్ షాహిద్ బ్యాటింగ్ ఎంచుకుని, భారత్‌ను ఫీల్డింగ్‌కు ఆహ్వానించాడు. అనారోగ్యం కారణంగా శుభమన్ గిల్ ఈ మ్యాచ్ కూడా దూరంగా ఉన్నాడు. 
 
ఆప్ఘన్ జట్టు ఇన్నింగ్స్‌లో గుర్బాజ్ 21, జడ్రాన్ 28, షా 22, షాహిది 80, ఒమర్జాయ 62, నబి 19, రషీద్ ఖాన్ 16, రెహ్మాన్ 10, జడ్రాన్ 2 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, హార్దిక్ పాండ్యా 2, ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఫలితంగా ఆప్ఘన్ జట్టు 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది.