సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (13:31 IST)

WTC Final: ఐసీసీపై పేలుతున్న మీమ్స్... భారత క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్

ICC
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final) తొలి రోజు ఆట వర్షార్పణం కావడానికే అధికావకాశాలు ఉన్నాయి. దీంతో భారత క్రికెట్ ప్రేమికులను ఆగ్రహావేశాలకు గురి చేస్తోన్నాయి. అత్త మీద కోపం.. దుత్త మీద చూపించినట్టు తయారైంది వారి పరిస్థితి.
 
వరుణ దేవుడి మీద ఉన్న కోపాన్ని ఐసీసీ మీద ప్రదర్శించేస్తోన్నారు. రెండేళ్లుగా ఎదురు చూస్తోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌ను వర్షాకాలంలో షెడ్యూల్ చేసినందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మీద భగ్గుమంటోన్నారు. ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. తమ ఆగ్రహానికి కామెడీని జోడించి.. ట్వీట్లు చేస్తోన్నారు. వాటికి మీమ్స్ రూపాన్ని ఇస్తోన్నారు. ఐసీసీకి ముందు చూపు లోపించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
 
వర్షాకాలం వస్తోందనే విషయం ఐసీసీకి తెలియదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. టెస్ట్ ఛాంపియన్ టీమ్‌కు అందజేసే గదకు గొడుగును వేసి మరీ ట్వీట్లు చేస్తున్నారు. క్రికెట్ ప్రేమికుల రెండేళ్ల నిరీక్షణకు వరుణ దేవుడు గండి కొట్టినట్టే. 
WTC Final


ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసిన ఉత్కంఠభరిత క్షణాలు నీటిపాలయ్యాయని, దానికి ప్రధాన కారణం ఐసీసీనేనంటోన్నారు. వర్షం వల్ల అయిదు రోజులపాటు సాగాల్సిన మ్యాచ్ వన్డే ఇంటర్నేషనల్‌గా మార్చి వేసిందంటూ సెటైర్లు సంధిస్తున్నారు.