ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (14:54 IST)

భారత క్రికెట్ జట్టు మహిళా వీరాభిమాని ఇకలేరు.. బీసీసీఐ సంతాపం

భారత క్రికెట్ జట్టుకు ఎంతోమంది వీరాభిమానులు ఉన్నారు. కానీ, ఆ 87 యేళ్ళ వృద్ధ మహిళా వీరాభిమానం మాత్రం ప్రత్యేకం. ఆమె జట్టు పట్ల చూపుతున్న ప్రేమకు టీమిండియాకు చెందిన అగ్ర క్రికెటర్లు ఫిదా అయిపోయారు. ఆమెతో ప్రత్యేకంగా సమావేశమై, ముచ్చటించారు. అలాంటి వీరాభిమాని ఇకలేరు. ఆమె లండన్‌లో మృతిచెందినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, చారులత పటేల్. వయసు 87 యేళ్ళు. పుట్టింది పెరిగింది విదేశాల్లోనే. కానీ మాతృదేశంపై ఆమెకు వల్లమానిని ప్రేమ, మమకారం. అందుకే భారత క్రికెట్ జట్టు విదేశాల్లో ఆడే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా ఆడుతూ ఉంటుంది. 
 
ఈమె తొలిసారి 1983లో లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్‌లో భారత క్రికెట్ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. అపుడు చారులత స్టేడియంలోనే ఉన్నారు. అప్పటి నుంచి ఇంగ్లండ్ వేదికగా జరిగే మ్యాచ్‌లకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రికెటర్లను ప్రోత్సహిస్తూ వస్తోంది. 
 
అ తర్వాత గత యేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో భారత జట్టు ఆడిన అన్ని మ్యాచ్‌లకు ఆమె హాజరవుతూ వచ్చింది. ఆ వయసులో కూడా ఆమె ఆనందం, ప్రోత్సాహం చూసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఓపెనర్ రోహిత్ శర్మలు ప్రత్యేకంగా ఆమెను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే, ఇటీవల అనారోగ్యంపాలైన ఆమె కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
భారత సంతతికి చెందిన చారులత, పుట్టింది, పెరిగిందీ విదేశాల్లోనే. 1975 నుంచి బ్రిటన్‌లో స్థిరపడిన ఆమె, అంతకుముందు దక్షిణాఫ్రికాలో ఉండేవారు. చారులత పటేల్ మృతిపట్ల బీసీసీఐ సంతాపాన్ని తెలిపింది. ఆమె ఎల్లప్పుడూ భారత జట్టుతోనే ఉంటారని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపింది.