శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (08:30 IST)

రెండేళ్ల తర్వాత ఢిల్లీ కోసం ఇషాంత్ శర్మ.. సత్తా తగ్గలేదే

Ishant Sharma
Ishant Sharma
శుక్రవారం కోల్‌కతా, ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రెండేళ్ల తర్వాత ఢిల్లీ జట్టు తరఫున ఇషాంత్ శర్మ  బరిలోకి దిగి రెండు వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ భారత క్రికెట్ జట్టులో అగ్రగామి బౌలర్. గత రెండేళ్లుగా ఐపీఎల్ మ్యాచ్‌లో ఆడని అతను శుక్రవారం ఢిల్లీ జట్టుకు ఆడాడు. 
 
నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో అతనికి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఇక శుక్రవారం మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా జట్టు 127 పరుగులు చేయగా, ఢిల్లీ జట్టు 19.2 ఓవర్లలో 128 పరుగులకే ఆలౌటైంది. ఈ ఐపీఎల్ సిరీస్‌లో శుక్రవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు తొలి విజయాన్ని నమోదు చేయడం గమనార్హం.
 
IPL 2023 వేలంలో ఇషాంత్ శర్మ బేస్ ధర రూ. 50 లక్షలు. శర్మను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 50 లక్షలకు ఎంచుకుంది. IPL 2021లో అతని జీతం 1.10 కోట్లు. శర్మ తన ఐపీఎల్ కెరీర్‌లో 6 జట్లకు ఆడాడు. అతను IPL 2008లో 3.80 కోట్లకు KKR చేత ఎంపికయ్యాడు.