శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 మార్చి 2023 (18:10 IST)

యూఎస్‌లో క్రికెట్ గొప్ప ఎత్తులకు చేరుకోవాలి.. కపిల్ దేవ్

kapil dev
యుఎస్‌లో క్రికెట్ ఇంకా శైశవదశలో ఉంది. అయితే దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అమెరికాలో క్రికెట్ గేమ్ భవిష్యత్తులో గొప్ప ఎత్తులకు చేరుకోవాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. 
 
ఈ ఏడాది చివర్లో జరగనున్న ఇండియన్ అమెరికన్ యూనిటీ క్రికెట్ లీగ్‌ను ప్రారంభించేందుకు జరిగిన కార్యక్రమంలో కపిల్ మాట్లాడుతూ.. "ఏ దేశం చూడని స్థాయికి ఏదో ఒక రోజు అమెరికా ఈ గేమ్‌ను తీసుకెళ్తుందని నేను ఆశిస్తున్నాను." అంటూ చెప్పారు. 
 
ఇండియన్ అమెరికన్ యూనిటీ క్రికెట్ లీగ్‌ను సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు కపిల్ దేవ్ ప్రకటించారు.