సోమవారం, 25 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2024 (20:11 IST)

ఐపీఎల్ 2024 : ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన బెంగుళూరు!!

kcr vs rcb
ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. బెంగళూరుతో జరిగిన పోరులో ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 223 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూరు 221 రన్స్‌కు ఆలౌట్ అయింది. 
 
ఆ జట్టులో జాక్స్‌ 32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 55 పరుగులు చేయగా, పాటిదార్‌ 23 బంతుల్లో 3 ఫోర్లు, ఐదు సిక్సర్లతో 52 పరుగులు చేసి అర్థ శతకాలతో రాణించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అయితే, ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా దిగిన విరాట్‌ కోహ్లీ (18), డుప్లెసిస్‌ (7) తీవ్ర నిరాశ పరిచారు. ప్రభుదేశాయ్‌ (24), గ్రీన్‌ (6) మహిపాల్‌ (4) పెద్దగా రాణించలేదు. మ్యాచ్ ఆఖరులో దినేశ్‌ కార్తీక్‌ (24), శర్మ(20) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. కోల్‌కతా బౌలర్లలో రసెల్‌ 3 వికెట్లు పడగొట్టగా.. హర్షిత్‌ రాణా, సునీల్‌ నరైన్‌ చెరో 2, వరుణ్‌ చక్రవర్తి, స్టార్క్‌ తలో ఒక వికెట్‌ పడగొట్టారు. 
 
అంతకుముందు కోల్‌కతా జట్టు టాస్ బ్యాటింగ్‌కు దిగి, నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్‌ సాల్ట్‌ 14 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 48 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ 36 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్ సాయంతో 50 రన్స్ చేసి, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. రింకూ సింగ్‌ (24), రసెల్‌  (27 నాటౌట్), రమణ్‌దీప్‌ (24 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. నరైన్‌ (10), రఘువంశీ (3), వెంకటేశ్‌ అయ్యర్‌ (16) నిరాశపరిచారు. బౌలర్లలో యశ్‌ దయాల్‌, గ్రీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ఫెర్గూసన్‌ తలో వికెట్‌ తీశారు.