1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 మే 2025 (11:14 IST)

Mohammed Shami: తప్పుడు రాతలు రాసి కెరీర్ నాశనం చేయొద్దు.. మహ్మద్ షమీ

shami
భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అడుగుజాడల్లోనే మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని పుకార్లు వ్యాపించాయి. మహమ్మద్ షమీ ఈ పొడవైన ఫార్మాట్ నుంచి వైదొలగడానికి సిద్ధమవుతున్నాడనే ఊహాగానాలతో సోషల్ మీడియా వేదికలు హోరెత్తుతున్నాయి. ఈ వార్తలపై మహమ్మద్ షమీ తీవ్రంగా ఖండించారు.
 
"నా రిటైర్మెంట్ గురించి వ్యాఖ్యానించే ముందు మీ స్వంత ఉద్యోగానికి వీడ్కోలు పలికే రోజులు లెక్కించడం ప్రారంభించండి" అని మహమ్మద్ షమీ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. "మీలాంటి వ్యక్తులు జర్నలిజాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఆటగాడి భవిష్యత్తు గురించి ఒక ఖచ్చితమైన అంచనా వేయడానికి ప్రయత్నించండి. ఇది నేను ఈ రోజు చూసిన చెత్త వార్త.. అంటూ మహమ్మద్ షమీ అన్నారు.
 
రిటైర్మెంట్ గురించి కనీసం ఆలోచించలేదని.. సోషల్ మీడియాలో తన కోపాన్ని వెళ్లగక్కాడు. తప్పుడు రాతలు రాసి కెరీర్ నాశనం చేయొద్దు అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ జూన్ 3న ముగుస్తుంది. కొంచెం గ్యాప్ తీసుకుని భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది.