శుక్రవారం, 24 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 జులై 2023 (22:05 IST)

ఐర్లాండ్‌ టూర్‌కి టీమిండియా.. హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

VVS Laxman
వెస్టిండీస్ టూర్ నుంచి ఐర్లాండ్‌ టూర్‌కి వెళ్తోంది టీమిండియా. ఈ టూర్ సందర్భంగా మూడు టీ-20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు భారత ప్రధాన కోచింగ్ స్టాఫ్‌ దూరంగా వుంటారు. ఈ నేపథ్యంలో వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా ఐర్లాండ్ టూర్ జరుగుతుంది. 
 
ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా, ఆ తర్వాత మూడు మ్యాచుల వన్డే సిరీస్, ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. 
 
మరో జట్టు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ వార్మప్ మ్యాచులతో బిజీగా గడపనుంది. చైనాకి వెళ్లే భారత పురుషుల జట్టుకి వీవీఎస్ లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు