1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్

ఐసీసీ ర్యాంకులు...: నంబర్ వన్ బౌలర్ ఎవరంటే....

kesav maharaj
ఐసీసీ వన్డే ప్రపంచ కప్ టోర్నీలో లీగ్ దశ మ్యాచ్‌లు ముగిసిపోగా, బుధవారం నుంచి సెమీస్ పోటీలు ప్రారంభమవుతున్నాయి. అయితే, ఈ మెగా ఈవెంట్‌ లీగ్ మ్యాచ్‌లలో పలువురు బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫలితంగా భారత క్రికెట్ జట్టు పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ టోర్నీలో రాణించినప్పటికీ  ఐసీసీ ర్యాంకుల పట్టికలో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ఫలితంగా సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహరాజ్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. అలాగే, భారత బౌలర్లలో బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు వరుసగా 4, 5 స్థానాలు దక్కాయి. 
 
ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల పట్టికలో మహ్మద్ సిరాజ్ చాలా రోజుల తర్వాత తన నంబర్ వన్ ర్యాంకును కోల్పోయాడు. మహరాజ్ నంబర్ వన్ స్థానానికి చేరుకోవడానికి అనేక అంశాలు దోహపడ్డాయి. గత బుధవారం నుంచి మూడు మ్యాచ్‌లు ఆడిన కేశవ్.. 7 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌పై 4, భారత్‌పై 1, ఆప్ఘనిస్థాన్‌పై 2 చొప్పున వికెట్లు తీశాడు. దీంతో కేశవ్ రేటింగ్ పాయింట్లు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం సిరాజ్ కంటే కేవలం 3 పాయింట్లు మాత్రమే ముందున్నాడు. ప్రస్తుతం సిరాజ్ కంటే కేవలం 3 పాయింట్లు మాత్రమే ముందున్నాడు. మహరాజ్ ఖాతాలో 726, సిరాజ్ 723 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 
 
భారత్ గతవారంలో ఒకే ఒక్క మ్యాచ్‌ మాత్రమే ఆడింది. దీంతో సిరాజ్ పెద్దగా రాణించేందుకు అవకాశం లేదు. మరోవైపు, భారత్‌ మరో పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌‍ తమ ర్యాంక్స్‌ను మెరుగుపరుచుకున్నారు. 687 రేటింగ్ పాయింట్లతో బుమ్రా 4వ స్థానంలో, 682 రేటింగ్ పాయింట్లతో కుల్దీప్ 5వ స్థానంలో నిలవడం గమనార్హం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ 2వ ర్యాంకులో నిలిచాడు. విరాట్ కోహ్లీ 5, రోహిత్ శర్మ 5 టాప్-10లో చోటుదక్కించుకున్నారు.