శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 29 జనవరి 2018 (18:01 IST)

విరాట్ కోహ్లీ గాల్లోకి తేలిపోయాడే.. గంగూలీ, లారా రికార్డులు బ్రేక్

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ విజయం సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యట

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో భారత్ విజయం సాధించడం ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అధిగమించాడు. భారత జట్టు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తోంది. ఇప్పటికే మూడు టెస్టులతోకూడిన పోటీలు ముగిసాయి. ఈ టెస్టు సిరీస్‌లో 2-0 సిరీస్ తేడాతో దక్షిణాఫ్రికా గెలుచుకుంది.
 
మూడో టెస్టులో టీమిండియా కంటితుడుపు చర్యగా విజయం సాధించింది. తద్వారా విరాట్ కోహ్లీ తన కెప్టెన్సీ సారథ్యంలో 21వ టెస్టు విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా భారత కెప్టెన్‌గా అధిక విజయాలు సాధించిన గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్‌గా ధోనీ (27 టెస్టులతో) అగ్రస్థానంలో నిలిచాడు. 
 
మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. జొహెన్నెస్‌బర్గ్ టెస్టులో రాణించిన కోహ్లి 12 రేటింగ్ పాయింట్లను మెరుగుపర్చుకుని 912 పాయింట్లను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆట్ టైం ర్యాంకింగ్స్‌లో బ్రియాన్ లారాను దాటేశాడు.
 
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లీ మూడో టెస్టులో భాగంగా చివరి రోజున బ్యాటింగ్ కంటే గాల్లో ఎగురుతూ చేసిన విన్యాసాలపై నెట్టింట చర్చ మొదలైంది. దక్షిణాఫ్రికాలో జరిగిన రెండు టెస్టుల్లో టీమిండియా రాణించకపోవడంతో..విరాట్‌ను ఏకిపారేసిన నెటిజన్లు.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా మైదానంలో కోహ్లీ చేసిన జంప్‌ల గురించి జోకులు పేలుస్తున్నారు. కోహ్లీ మైదానంలో గాల్లోకి ఎత్తుకు ఎగిరిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.