వామ్మో... భార్యను చూసి జడుసుకున్నా: విరాట్ కోహ్లీ
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి నటించిన ''పారీ'' సినిమా చూసి షాక్ అయ్యాడు. ఇంకా ఆ చిత్రంలో తన భార్య నటన చూసి భయపడ్డానని.. ఆమె హావభావాలు తనను మరింత భయపెట్టాయని.. విరాట్ కోహ్లీ వ్యా
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి నటించిన ''పారీ'' సినిమా చూసి షాక్ అయ్యాడు. ఇంకా ఆ చిత్రంలో తన భార్య నటన చూసి భయపడ్డానని.. ఆమె హావభావాలు తనను మరింత భయపెట్టాయని.. విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు. అనుష్క నటించిన హారర్ మూడీ ''పారీ'' శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
చాలాకాలంగా ఇంత మంచి చిత్రాన్ని చూశానని, తన భార్య నటించిన మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ చిత్రంలో అద్భుతంగా నటించిందని కోహ్లీ కొనియాడాడు. ఆమె నటనకు ముగ్ధుడినై గర్వపడుతున్నానని వ్యాఖ్యానించాడు.
మరోవైపు.. విరాట్ కోహ్లీపై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. శ్రీలంకతో జరుగనున్న సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఇంట్లో సేదతీరుతున్నాడు. ఈ నేపథ్యంలో ఒక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కాఫీ పట్టుకుని ఫోజిచ్చిన కోహ్లీ.. ''ఇంట్లో కాఫీ తాగుతున్నాను. చాలా బాగుంది'' అని పేర్కొన్నాడు. దీంతో ఆ కాఫీని ఎవరు చేశారు.. అనుష్క చేసిందా.. అంటూ నెటిజన్లు అభిమానులు ప్రశ్నలు సంధించారు.