1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 5 జనవరి 2020 (12:26 IST)

అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించిన ఇర్ఫాన్ పఠాన్

భారత సీనియర్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్‌‌కు వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. చివరిసారిగా 2019 ఫిబ్రవరిలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో జమ్ము కశ్మీర్‌ తరఫున పోటీ క్రికెట్‌ ఆడాడు. 
 
గత నెలలో జరిగిన ఐపీఎల్‌-2020 వేలంలో కూడా తన పేరును నమోదు చేసుకోలేదు. 2003లో అడిలైడ్‌ ఓవల్‌లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టీమ్‌ఇండియా తరఫున 2012 అక్టోబర్‌లో చివరిసారిగా ఆడాడు.
 
ఇకపోతే.. ఇర్ఫాన్ 29 టెస్టుల్లో( 1105 పరుగులు, 100 వికెట్లు), 120 వన్డేల్లో(1544 పరుగులు, 173 వికెట్లు), 24 టీ20(172 పరుగులు, 28 వికెట్లు)ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2007 ట్వంటీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచిన భారత జట్టులో ఇర్ఫాన్‌ ఉన్నాడు.