ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (12:09 IST)

సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ.. శాసించే స్థితిలో భారత్

భారత క్రికెట్ జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ప్రస్తుతం ఇరు జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుదోంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కీలకమైన సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. 
 
కీల‌క‌మైన రెండో ఇన్నింగ్స్‌లో సెంచ‌రీ చేసి త‌న స‌త్తా ఏంటో చాట‌డంతోపాటు టీమ్‌ను కూడా ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ వైఫ‌ల్యంతో మ్యాచ్‌లో పెద్ద‌గా ఆశ‌లు లేని స్థితి నుంచి ఇప్పుడు మ్యాచ్‌ను శాసించే స్థితికి టీమిండియా చేర‌డంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. 
 
ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న నాలుగో టెస్ట్‌లో రోహిత్ సత్తా చాటాడు. ఓవ‌ల్‌లో 94 ప‌రుగుల ద‌గ్గ‌ర ఉన్న స‌మ‌యంలోనే ఏకంగా సిక్స‌ర్‌తో త‌న చిరకాల వాంఛ‌ను నెర‌వేర్చుకున్నాడు. 
 
రోహిత్ 127 ప‌రుగులు చేయ‌డంతో టీమిండియా మూడో రోజు ఆట ముగిసే స‌మయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల‌కు 270 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం 171 ప‌రుగుల లీడ్‌లో ఉన్న కోహ్లి సేన‌.. క‌నీసం మ‌రో 100 ప‌రుగులైనా చేయ‌గ‌లిగితే.. మ్యాచ్‌పై ప‌ట్టు బిగించిన‌ట్లే.