మంగళవారం, 11 నవంబరు 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 సెప్టెంబరు 2025 (11:23 IST)

పాకిస్థాన్ ఆటగాళ్ల ప్రవర్తన పిల్లచేష్టలు.. బ్యాట్‌తోనే సమాధానం : టీమిండియా

Ryan ten Doeschate
ఆసియా కప్ సూపర్-4లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారితీసింది. భారత ఆటగాళ్ళతో వాగ్వాదం చేయడమే కాకుండా.. హారిస్ రవూఫ్, షాహిబాద్ ఫర్హాన్ హావభావాలు భారత్‌ను కించపరిచేలా ఉన్నాయి. మ్యాచ్‌లో విజయంతో వారికి సరైన గుణపాఠం చెప్పారంటూ భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పాక్ ప్లేయర్ల చేష్టలపై భారత సహాయక కోచ్ రైన్ టెన్ దస్కతే స్పందించాడు. అలాంటి సమయంలోనూ హుందాగా వ్యవహరించిన సూర్య సేనను అభినందించాడు. తాము ఇలాంటి వాటిని పట్టించుకోమని, బ్యాట్‌తోనే సమాధానం ఇస్తామని వ్యాఖ్యానించాడు.
 
'ఆసియా కప్‌లో భారత్ - పాక్ మ్యాచ్ సందర్భంగా ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో నేను చెబుతా. ఇలాంటప్పుడు వారి ప్రవర్తనను నియంత్రించడం చాలా కష్టం. హారిస్ రవూఫ్ ఏం చేశాడో చూశా. అదేమీ మమ్మల్ని ఆందోళనకు గురిచేయలేదు. నేను ఇంతకుముందు చెప్పినట్లు.. మా కుర్రాళ్లు వ్యవహరించిన తీరుపై గర్వంగా ఉన్నా. మైదానంలో కేవలం బ్యాట్‌తోనే సమాధానం ఇవ్వాలని అనుకున్నారు. అదే చేసి చూపించారు' అని దస్కతే వెల్లడించాడు.