శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2017 (17:30 IST)

#cricket wali beat: సోనూ నిగమ్‌తో గొంతు కలిపేశాడు.. సచిన్ పాట పాడేశాడు..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆయనే టైటిల్ రోల్ పోషించనుండటం విశేషం. ఇలా యాక్టర్ అయిన సచిన్ టెండూల్కర్.. గాయకుడి అవతారం ఎత్తాడు. సోషల్ మీడియాల

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఆయనే టైటిల్ రోల్ పోషించనుండటం విశేషం. ఇలా యాక్టర్ అయిన సచిన్ టెండూల్కర్.. గాయకుడి అవతారం ఎత్తాడు. సోషల్ మీడియాలో సచిన్ టెండూల్కర్‌ను సచిన్‌ను చూసినవారంతా షాక్ అయ్యారు. 
 
ఈ వీడియోలో బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్‌తో మాస్టర్ గొంతుకలిపారు. ఇండియన్‌ ఐడల్‌ ఫైనల్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సచిన్‌ 'క్రికెట్‌ వాలే బీట్‌' పేరుతో ఒక ఆల్బమ్‌ను ఫ్యాన్స్‌కు పరిచయం చేశాడు. సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్‌లో నిలిచిపోయిన 2011 ప్రపంచకప్‌ విజయాన్ని ఆధారంగా చేసుకుని ‘లిటిల్‌ మాస్టర్‌' అనే డాక్యుమెంటరీ తయారైంది.
 
మాస్టర్ సచిన్ 44వ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. ఏప్రిల్‌ 23న సోనీ ఈఎస్‌పీఎన్‌ చానెల్‌లో ప్రసారం చేయనున్నారు. ఇంకా భారత జట్టుకు సుదీర్ఘ కాలం సేవలందించిన సచిన్‌కు ప్రపంచకప్‌తో వీడ్కోలు పలికేముందు ఆటగాళ్లు భావోద్వేగానికి గురైన తీరుని ఫ్యాన్స్‌కు చూపెట్టనున్నారు. 
 
ఈ ఆల్బమ్‌లో సచిన్ అక్కడక్కడా కొన్ని పదాల వరకే కాపాడాడు. ఈ సందర్భంగా సచిన్‌ మీడియాతో మాట్లాడాడు. 'ఆరు ప్రపంచ కప్‌లలో తనతోపాటు ఎందరో ఆడారు. వారందరికీ ఈ పాట అంకితమని చెప్పారు. దేశంలోని ప్రతి అభిమానిని ఈ పాట అలరిస్తుందని ఆశిస్తున్నానని సచిన్ చెప్పుకొచ్చారు. ఇకపోతే.. సోనూ నిగమ్‌తో కలిసి సచిన్ పాట పాడటంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా సచిన్‌పై సోషల్ మీడియాతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.