గురువారం, 26 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 1 జులై 2024 (17:19 IST)

ఐసీసీ బెస్ట్ టీమ్ ఇదే... 11 మంది ఆటగాళ్లతో జట్టు.. అందులో ఆరుగురు భారతీయులే

virat kohli
అమెరికా, వెస్టిండీస్ వేదికల్లో జరిగిన ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ముగిసింది. ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ పేరిట మొత్తం 11 మంది సభ్యులతో కూడిన జట్టును ఐసీసీ ప్రకటించింది. టోర్నమెంట్ గెలిచిన భారత జట్టు నుంచి ఆరుగురు ఆటగాళ్లకు ఇందులో చోటుదక్కింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో తొలి పేరు రోహిత్ శర్మదే కావడం విశేషం. 
 
సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్ట్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్‌లకు కూడా చోటుదక్కింది. అయితే ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా రాణించిన కింగ్ విరాట్ కోహ్లికి చోటుదక్కక పోవడం గమనార్హం. దీనికి కారణం లేకపోలేదు. కోహ్లీ టోర్నీ మొత్తం మ్యాచ్‌లలో పూర్తిగా విఫలమ్యాడు. కానీ, ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించి జట్టును విజయపథంలో నడిపించాడు. 
 
ఐసీసీ ప్రకటించిన ది బెస్ట్ జట్టు ఇదే... 
రోహిత్ శర్మ, రహ్మానుల్లా గుర్బాజ్, నికోలస్ పూరన్, సూర్యకుమార్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, ఫజలాక్ ఫరూఖీ (12వ ఆటగాడు).