బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 9 అక్టోబరు 2017 (10:11 IST)

టీమిండియాకు అత్యుత్తమ ఫినిషర్ ధోనీ : వీరేంద్ర సెహ్వాగ్

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగమే కారణమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్ధమాన ఆట

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతిగడించడం వెనుక మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ త్యాగమే కారణమని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడం, సరికొత్త ప్రయోగాలు విరివిగా వుండేవని.. ఈ క్రమంలోనే ధోనీ ప్రతిభ బయటపడిందన్నాడు.

ఆ సమయంలోనే భారత్ విదేశాల్లో తిరుగులేని విజయాలు సాధించడానికి అలవాటు పడిందని.. ఆ దశలోనే ధోనీ కోసం గంగూలీ తన బ్యాటింగ్ ఆర్డర్‌ను త్యాగం చేశాడని గుర్తు చేశాడు.  
 
ఓపెనర్లు చక్కని భాగస్వామ్యం నమోదు చేయనట్లైతే.. పించ్ హిట్టర్లు పఠాన్ లేదా ధోనీలలో ఒకర్ని మూడో నెంబర్లో పంపించాలని నిర్ణయించినట్లు సెహ్వాగ్ తెలిపాడు. ఓపెనర్లు రాణించినా, ధోనీని గంగూలీ మూడో నెంబర్‌లో బ్యాటింగ్‌కు పంపేవాడని, దీంతోనే ధోనీ అవకాశాల్ని వినియోగించుకున్నాడని వెల్లడించాడు. ఆ రోజు అలాంటి అవకాశం ధోనీకి కల్పించి ఉండకపోతే గొప్ప బ్యాట్స్‌మన్‌గా నిరూపించుకునేందుకు మరింత సమయం పట్టేదన్నాడు.