ఆస్ట్రేలియా కోచ్‌పై సునీల్ గవాస్కర్ ఫైర్
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా కోచ్ లాంగర్‌పై భారత క్రికెట్ లెజండ్ సునీల్ గవాస్కర్ ఫైర్ అయ్యారు. విరాట్ అలా డ్యాన్స్ చేయడం అసభ్యంగా ఏం లేదని.. అది ఆటపై తనకున్న ప్రేమను తెలిపేదిగానే ఉందన్నారు.
విరాట్‌ను మొరటు వ్యక్తి అని.. తాము అయితే అలా చేసి ఉండేవాళ్లం కాదంటూ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించారు. దీనిపై సునీల్ స్పందిస్తూ, లాంగర్ సానుభూతికోసం చూస్తున్నారన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఓపెనర్ ఫించ్ క్లీన్ బౌల్డైనప్పుడు విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేయడంపై లాంగర్ స్పందిస్తూ.. విరాట్ ఓ మొరటు మనిషని.. అతనిలా ప్రవర్తించడం తమవల్ల కాదని.. మేం కూడా అలా చేస్తే, ప్రపంచంలో మా అంత మొరటువాళ్లు మరెవరూ ఉండరని అన్నాడు.